Kiran Abbavaram: గ్రామీణ నేపథ్యంలోని ప్రేమకథగా 'సమ్మతమే' .. ఫస్టులుక్ రిలీజ్

- మరో ప్రేమకథగా 'సమ్మతమే'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- దర్శకుడిగా గోపీనాథ్ రెడ్డి
- 80శాతం షూటింగు పూర్తి
కొంతకాలం క్రితం 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా కిరణ్ అబ్బవరం పరిచయమయ్యాడు. ఆ తరువాత ఆయన 'ఎస్ ఆర్ కల్యాణ మండపం' సినిమా చేశాడు. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఆయన జోడీగా ప్రియాంక జవాల్కర్ నటించింది. వచ్చేనెల 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే, ఆయన మరో మూడు ప్రాజెక్టులు లైన్లో పెట్టేశాడు. ఆ సినిమాల్లో ఒకటిగా 'సమ్మతమే' కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
