TRS: వరదనీటిలో చిక్కుకుపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు

TRS MLA Sridhar Reddy car stuck in flood water

  • రెండు రోజులుగా హైదరాబాదులో భారీ వర్షాలు
  • నీట మునిగిన పలు కాలనీలు
  • ముంపుకు గురైన కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వీధులు కాలువలను తలపిస్తున్నాయి. పలు కాలనీల్లో జనాలు కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వరద ముంపుకు గురైన కాలనీల్లో ఈ ఉదయం పర్యటించారు.

ఈ సందర్భంగా హస్తినాపురం కాలనీకి వచ్చే సమయానికి ఆయన ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో చిక్కుకుంది. కారును ముందుకు తోసేందుకు ఆయన వెంట ఉన్నవారు ప్రయత్నించినా కారు కదలలేదు. చివరకు ఆయన కూడా కిందకు దిగి కారును తోశారు. అయినా కారు కదలకపోవడంతో వరద నీటిలోనే ఆయన నడుచుకుంటూ ముందుకు సాగారు.

TRS
MLA
Sridhar Reddy
Flood Water
  • Loading...

More Telugu News