Kiran Abbavaram: నిర్మాతగా కోడి రామకృష్ణ కూతురు .. హీరోగా కిరణ్ అబ్బవరం!

- కిరణ్ అబ్బవరం నుంచి కొత్త ప్రాజెక్టు
- దర్శకుడిగా కార్తీక్ శంకర్ పరిచయం
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- త్వరలో పూర్తి వివరాలు
తెలుగు ప్రేక్షకులకు కుటుంబ నేపథ్యంలో సాగే ఎన్నో చిత్రాలను కోడి రామకృష్ణ అందించారు. తెలుగు కథకు గ్రాఫిక్స్ ను జోడించి ప్రయోగాలు చేసింది కూడా ఆయనే. ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. అలాంటి ఆయన పెద్ద కూతురు దివ్య, సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని నిర్మాతగా రంగంలోకి దిగారు. కిరణ్ అబ్బవరం హీరోగా ఆమె ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు.
