Mehul Choksi: ఆంటిగ్వా చేరుకున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ
- మెహుల్ కు బెయిల్ మంజూరు చేసిన డొమినికా హైకోర్టు
- 10 వేల ఈసీ డాలర్లను డిపాజిట్ చేసిన చోక్సీ
- ఛార్టర్డ్ విమానంలో ఆంటిగ్వాకు చేరుకున్న వైనం
పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆంటిగ్వా నుంచి క్యూబాకు వెళ్లే క్రమంలో డొమినికా పోలీసులకు ఆయన చిక్కారు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారనే కారణాలతో ఆ దేశ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా మెహుల్ కు డొమినికా హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆంటిగ్వాకు వెళ్లేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో 62 ఏళ్ల చోక్సీ ఆంటిగ్వాకు చేరుకున్నారు. 10,000 ఈసీ డాలర్ల (ఈస్ట్ కరీబియన్ డాలర్లు) బెయిల్ డబ్బును డిపాజిట్ చేసిన తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. డొమినికా నుంచి ఒక ఛార్టర్డ్ విమానంలో ఆంటిగ్వాకు చేరుకున్నారు. అక్కడ న్యూరాలజిస్ట్ వద్ద ఆయన చికిత్స పొందనున్నారు.