CM Jagan: ఆక్వా వర్సిటీ పనులను వేగవంతం చేయండి: సీఎం జగన్

 CM Jagan orders on Aqua University works

  • మత్స్య, పాడి, పశు సంవర్ధక శాఖలపై సమీక్ష
  • తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం
  • అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం
  • సీఎంకు అభివృద్ధి పనులు నివేదించిన అధికారులు

మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై సీఎం జగన్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో, ఆక్వా యూనివర్సిటీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు పలు అభివృద్ధి పనులపై సీఎంకు నివేదించారు.

రాష్ట్రంలో ఐదు ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ పనులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. అంతేగాకుండా, ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమూల్ పాల వెల్లువ కార్యాచరణ ప్రారంభించినట్టు వివరించారు. అనంతరం సీఎం స్పందిస్తూ, రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో కేజ్ ఫిష్ కల్చర్, మారి కల్చర్ మొదలుపెట్టాలని అధికారులకు సూచించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News