Gopichand: హిట్స్ ఇచ్చిన దర్శకుడితో గోపీచంద్!

Gopichand  in Sriwass movie

  • 'లక్ష్యం'తో భారీ హిట్
  • 'లౌక్యం'తో భారీ వసూళ్లు
  • మూడో సినిమాకి సన్నాహాలు
  • త్వరలోనే సెట్స్ పైకి

యాక్షన్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన గోపీచంద్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తన సినిమాలకు వచ్చేలా చేసుకున్నాడు. తన సినిమాల్లో ఎమోషన్ తో పాటు కామెడీ కూడా ఉండేలా చూసుకున్నాడు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తనని తాను మార్చుకోవడానికీ .. మలచుకోవడానికి గోపీచంద్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆల్రెడీ ఆయన చేసిన 'సీటీమార్' రిలీజ్ కి రెడీగా ఉండగా, 'పక్కా కమర్షియల్' సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకుడు శ్రీవాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.శ్రీవాస్ - గోపీచంద్ కాంబినేషన్లో ఇంతకుముందు 'లక్ష్యం' .. 'లౌక్యం' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. మరో ప్రాజెక్టుతో ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పోస్టర్ ను కూడా వదిలారు. కెరియర్ పరంగా గోపీచంద్ కి ఇది 30వ సినిమా. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. భూపతిరాజా అందించే ఈ కథతో శ్రీవాస్ - గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.

Gopichand
Sriwass
Tollywood
  • Loading...

More Telugu News