Telangana: రేపు మరోసారి సమావేశం కానున్న తెలంగాణ మంత్రివర్గం

Telangana cabinet will meet again tomorrow

  • ఈ మధ్యాహ్నం తెలంగాణ క్యాబినెట్ భేటీ
  • సుదీర్ఘ సమయం పాటు చర్చ
  • ఉద్యోగ నియామకాలే ప్రధాన అజెండా
  • పూర్తి వివరాలతో హాజరు కావాలని అధికారులకు ఆదేశం

ఈ మధ్యాహ్నం నుంచి సుదీర్ఘ సమయం పాటు సాగిన తెలంగాణ క్యాబినెట్ భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఉద్యోగ నియామకాల అంశంపై సమగ్రంగా చర్చించేందుకు రేపు మరోసారి సమావేశం కానున్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీపై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు తదితర అంశాలపై రేపటి సమావేశంలో చర్చించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగాలు కేటాయిస్తున్నందున, రేపటి సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

Telangana
Cabinet
Meeting
CM KCR
Job Recruitment
  • Loading...

More Telugu News