Nagashourya: సెట్స్ పైకి నాగశౌర్య సొంత ప్రాజెక్టు!

Nagashourya new movie upadate

  • వరుస సినిమాలతో నాగశౌర్య 
  • సొంత బ్యానర్లో ఓ సినిమా 
  • దర్శకుడిగా నాగశౌర్య 
  • కీలకమైన పాత్రలో రాధిక    

ఒక వైపున ఇతర దర్శక నిర్మాతలతో వరుస సినిమాలు చేస్తున్న నాగశౌర్య, మరో వైపున సొంత సినిమాలు కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. వాటిలో ఒక సినిమా నాగశౌర్య సొంత బ్యానర్లో రూపొందుతోంది. ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు ఆయన 'అలా ఎలా?' .. 'లవర్' .. ' గాలి సంపత్' సినిమాలను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలేవీ అంతగా ఆడలేదు.  'గాలి సంపత్' సరిగ్గా ఆడకపోవడంతో, అతనితో నాగశౌర్య సినిమా ఉండకపోవచ్చని అనుకున్నారు.

కానీ నాగశౌర్య .. అనీష్ కృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు. కొన్నిరోజుల పాటు ఈ షూటింగ్ నడించింది. ఆ తరువాత కరోనా ప్రభావం పెరగడంతో షూటింగును ఆపేశారు. అలా ఆగిపోయిన షూటింగు మళ్లీ ఇప్పుడు మొదలైంది. నాగశౌర్య తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి 'షిర్లే సెటియా' కథానాయికగా పరిచయమవుతోంది. సీనియర్ నటి రాధిక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

Nagashourya
Shirle
Radhika
  • Loading...

More Telugu News