Telugu Academy: పరభాష వ్యామోహంతో మాతృభాషను చంపేస్తున్నారు: ఎస్ఎఫ్ఐ ఏపీ అధ్యక్షుడు

AP govt killing Telugu says Students unions

  • తెలుగు అకాడెమీ పేరు మార్పుపై విద్యార్థి  సంఘాల ఫైర్
  • తెలుగు తల్లి విగ్రహానికి వినతి పత్రం సమర్పణ
  • పేరెందుకు మార్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నేతలు

ఏపీ తెలుగు అకాడెమీ పేరును మార్చడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి విద్యార్థి సంఘాలు వినతిపత్రాన్ని ఇచ్చి, నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు భాషను నిర్వీర్యం చేయాలనే చూస్తున్నారని ప్రసన్నకుమార్ మండిపడ్డారు. పరభాషా వ్యామోహంతో మాతృభాషను మృతభాషగా చేయాలనుకోవడం దారుణమని అన్నారు. ఏపీలో తెలుగు మీడియంను పూర్తిగా తీసేయాలనే ప్రభుత్వ ఆలోచనను కోర్టులు కూడా తప్పు పట్టాయని చెప్పారు. తెలుగు అకాడెమీ పేరును మార్చాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని... లేనిపక్షంలో అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News