Chandrababu: మిడిల్ ఆర్డర్ లో స్థిరత్వం తీసుకొచ్చిన ఆటగాడు యశ్ పాల్: చంద్రబాబు

Chandrababu pays condolences to Yashpal Sharma

  • టీమిండియా మాజీ ఆటగాడు యశ్ పాల్ శర్మ మృతి
  • ప్రపంచ కప్ గెలుచుకున్న హీరోల్లో ఒకరని చంద్రబాబు ప్రశంస
  • ఆయన మరణ వార్త బాధను కలిగించిందన్న బాబు

టీమిండియా మాజీ ఆటగాడు యశ్ పాల్ శర్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఢిల్లీలో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు. 66 ఏళ్ల యశ్ పాల్ జాతీయ జట్టుకు సెలెక్టర్ గా కూడా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

మాజీ క్రికెటర్ యశ్ పాల్ మరణవార్త బాధను కలిగించిందని చంద్రబాబు అన్నారు. 1983లో జరిగిన ప్రపంచ కప్ ను గెలుచుకున్న హీరోల్లో యశ్ పాల్ ఒకరని చెప్పారు. భారత్ మిడిల్ ఆర్డర్ కు స్థిరత్వాన్ని తీసుకొచ్చిన బ్యాట్స్ మెన్ అని కొనియాడారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు సంతాపాన్ని ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News