Somireddy Chandra Mohan Reddy: కృష్ణా జలాల విషయంలో ప్రేమలేఖలతో సరిపెడతారా జగన్ గారూ?: సోమిరెడ్డి

Somireddy questions CM Jagan on water disputes

  • తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు
  • ఏపీ సర్కారుపై టీడీపీ విమర్శలు
  • సీఎం జగన్ ను ప్రశ్నించిన సోమిరెడ్డి
  • కేసీఆర్ పేరెత్తడానికి భయపడుతున్నారా? అంటూ ఆగ్రహం

ఏపీ, తెలంగాణ జల వివాదాల నేపథ్యంలో టీడీపీ నేతలు వైసీపీ సర్కారుపై విమర్శల దాడి తీవ్రతరం చేశారు. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎం జగన్ పై తాజాగా విమర్శనాస్త్రాలు సంధించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరితో రాయలసీమ ప్రమాదంలో పడిందని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

మీకు రాజకీయ భిక్ష పెట్టిన రాయలసీమకు ఈ పరిస్థితి వస్తే, మీరు ప్రేమలేఖలతోనే సరిపెడతారా జగన్ గారూ? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. రోజూ 8 వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రం పాలవుతుంటే నోరు విప్పరా? అంటూ ప్రశ్నించారు. కనీసం కేసీఆర్ పేరు ఎత్తడానికి భయపడుతున్నారా? అంటూ సోమిరెడ్డి నిలదీశారు. ఇక ఢిల్లీ వెళ్లి తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని, ఇప్పుడు స్పందించకపోతే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం తప్పదని స్పష్టం చేశారు.

Somireddy Chandra Mohan Reddy
CM Jagan
Water Disputes
CM KCR
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News