Mahesh Babu: మళ్లీ 'సర్కారువారి పాట' మొదలు!

- బ్యాంకు స్కామ్ నేపథ్యంలో సాగే కథ
- కరోనా కారణంగా ఆగిన షూటింగు
- మళ్లీ ఈ రోజున సెట్స్ పైకి
- సంక్రాంతికి భారీ విడుదల
మహేశ్ బాబు .. పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. 14 రీల్స్ ప్లస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, మహేశ్ బాబు కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగు 'దుబాయ్'లో జరిగింది. ఆ తరువాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతూ ఉండగా, కరోనా కారణంగా షూటింగు ఆపేశారు. కరోనా ఉద్ధృతి తగ్గడం వలన, ఈ రోజున హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగును మళ్లీ మొదలుపెట్టారు. మహేశ్ బాబు తదితరులు షూటింగులో పాల్గొంటున్నారు.
