Vijay Sai Reddy: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy urges CBI Court to go abroad

  • సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న విజయసాయి
  • ఇండోనేషియా, దుబాయ్ వెళ్లాల్సి ఉందని వెల్లడి
  • కోర్టులో పిటిషన్ దాఖలు
  • రెండు వారాలు అనుమతించాలని విజ్ఞప్తి

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి తాజాగా సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని విజయసాయి న్యాయస్థానాన్ని కోరారు. అనుమతి ఇస్తే దుబాయ్, ఇండోనేషియా దేశాలకు వెళతానని వివరించారు. విదేశాలకు వెళ్లేందుకు రెండు వారాలు అనుమతి కావాలని విజ్ఞప్తి చేశారు.

విజయసాయి తాజా పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న మీదట విజయసాయి పిటిషన్ పై తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16కి వాయిదా వేసింది.

Vijay Sai Reddy
Abroad
CBI Court
Petition
  • Loading...

More Telugu News