Ram: కృతి శెట్టితో కలిసి రంగంలోకి దిగిన రామ్

- రామ్ 19వ సినిమా మొదలు
- కథానాయికగా కృతి శెట్టి
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
- తెలుగు .. తమిళ భాషల్లో విడుదల
రామ్ కథానాయకుడిగా లింగుసామి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, కొన్ని రోజులుగా తొలి షెడ్యూల్ కి సంబంధించిన సన్నాహాలను చేసుకుంటూ వస్తోంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ రోజున మొదలైంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. తొలి షెడ్యూల్ లోనే హీరో హీరోయిన్ ఇద్దరిపై సీన్స్ ప్లాన్ చేయడం విశేషం. ఇలా చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది.
