Sajjala Ramakrishna Reddy: వైసీపీలో అందరికీ సమాన గౌరవం ఉంటుంది: సజ్జల

Sajjala comments on party matters

  • పార్టీ విషయాలు మాట్లాడిన సజ్జల
  • వైసీపీ ఓ కుటుంబం వంటిదని వెల్లడి
  • కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తున్నారని కితాబు
  • కష్టపడి పనిచేస్తే పదవులు అవే వస్తాయని వ్యాఖ్యలు

వైసీపీ ఓ కుటుంబం వంటిదని, పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిజాయతీగా కష్టపడితే పదవులు వెతుక్కుంటూ వస్తాయని సీఎం జగన్ నిరూపించారని పేర్కొన్నారు. ప్రజలతో మమేకం అవుతూ, ప్రజల కోసం పనిచేసే వారికి నాయకత్వ లక్షణాలు వాటికవే వస్తాయని తెలిపారు.

అయితే, పదవులు కొందరికి ముందుగా వస్తాయని, మరికొందరికి తర్వాత వస్తాయని, అంతమాత్రాన పదవులు రానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో సమాన గౌరవం ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు.

Sajjala Ramakrishna Reddy
YSRCP
Workers
Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News