Assom: పోలీసులతో పోరాడలేకపోతున్నాడని.. 'అసోం వీరప్పన్'ను చంపేసిన సొంత ముఠా సభ్యులు

Assom Veerappan Shot Dead by his own group members

  • యూపీఆర్ఎఫ్ కమాండర్ మంగిన్ కల్హౌ హతం
  • శనివారం అర్ధరాత్రి దాటాక ఘటన
  • ఒళ్లంతా తూటాలతో తూట్లు

అసోం వీరప్పన్ మంగిన్ కల్హౌ హతమయ్యాడు. పోలీసులకు చిక్కకుండా, దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అతడు తన సొంత ముఠా సభ్యుల చేతుల్లోనే చనిపోయాడు. పోలీసులతో సరిగ్గా పోరాడలేకపోతున్నాడని.. గ్రూప్ లోని యువ సభ్యులే తమ నాయకుడైన మంగిన్ ను కాల్చి చంపినట్టు పోలీసులు చెబుతున్నారు. అసోంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలోని శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు.

వీరప్పన్ లాగానే ఇతడూ గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసేవాడని, యునైటెడ్ పీపుల్స్ రెవల్యూషనరీ ఫ్రంట్ (యూపీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేసి తనను తాను కమాండర్ గా చెప్పుకొనే వాడని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి వారితో జరుగుతున్న ఎన్ కౌంటర్లలో ఇప్పటికే ఆ గ్రూప్ కు చెందిన సీనియర్ లీడర్లందరూ చనిపోయారు. మరికొందరు పోలీసులకు లొంగిపోయారు.

మిగతా వాళ్లూ లొంగిపోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే బొకాజన్ పట్టణానికి సమీపంలోని ఖెంగ్పిబంగ్ కొండల్లో గ్రూపు మధ్య అంతర్గత గొడవలు జరిగి ఉంటాయని పోలీసులు చెప్పారు. అతడి శరీరం మొత్తం తూటాలతో తూట్లు పడిపోయిందని, ఆదివారం ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించామని చెప్పారు.  

కాగా, యూపీఆర్ఎఫ్ లో ఎక్కువగా కూకి వర్గానికి చెందిన వారే ఉన్నారు. యూపీఆర్ఎఫ్ ముఠాలోని వారికి అత్యంత క్రూరులుగా పేరుంది. చైనాలోని యునాన్ ప్రావిన్స్ నుంచి మయన్మార్ మీదుగా వారు తుపాకులు తీసుకొచ్చి విధ్వంసం సృష్టించారని పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది అక్టోబర్ లో తమ కమాండర్ ఇన్ చీఫ్ మార్టిన్ గ్వీటె చనిపోవడంతో లొంగిపోదామని దళ సభ్యులు నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వానికి లేఖ రాశారు. రెండు నెలల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని, తాము లొంగిపోతామని పేర్కొంటూ 50 మంది దాకా దళ సభ్యుల పేర్లను ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News