Akhil: యాక్షన్ లోకి దిగిపోయిన 'ఏజెంట్'

- సురేందర్ రెడ్డి కొత్త ప్రయోగం
- డిఫరెంట్ లుక్ తో అఖిల్
- పాత్ర కోసం సిక్స్ ప్యాక్
- రెగ్యులర్ షూటింగు మొదలు
టాలీవుడ్ దర్శకులలో సురేందర్ రెడ్డికి ఓ ప్రత్యేకత ఉంది. హీరోలను ఆయన ఎంతో స్టైలీష్ గా చూపిస్తాడు. అప్పటివరకూ సినిమాలు చేస్తూ వచ్చిన హీరోలు, ఆయన సినిమా దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా డిఫరెంట్ లుక్ తో షాక్ ఇస్తారు. అలా అఖిల్ ను కూడా సురేందర్ రెడ్డి కొత్తగా చూపించనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్ పైకి వెళ్లడానికి 'ఏజెంట్' కొంతకాలంగా ఎదురుచూస్తున్నాడు. కరోనా ప్రభావం చాలావరకూ తగ్గడంతో, ఈ రోజున ఈ సినిమా టీమ్ రంగంలోకి దిగిపోయింది. ఈ రోజు నుంచి ఇక రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతుంది.
