Nani: 'జెర్సీ' దర్శకుడితో మరోసారి నాని!

Nani another movie with Jersy director
  • నాని క్రేజ్ ను పెంచిన 'జెర్సీ'
  • హిందీలో రీమేక్ చేసిన దర్శకుడు
  • లాక్ డౌన్ సమయంలో కొత్తకథ
  • దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రం   
ఒకసారి తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో తిరిగి పనిచేయడం నానీకి అలవాటు. అలా ఆయన మోహనకృష్ణ ఇంద్రగంటి .. శివ నిర్వాణలతో చేశారు. తాజాగా 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి కూడా మరో ఛాన్స్ ఇచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. నాని ఇంతవరకూ విభిన్నమైన కథలలో .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చాడు. వాటిలో ఆయనకి గుర్తింపు తెచ్చి పెట్టిన పాత్రల్లో 'అర్జున్' పాత్ర ఒకటి. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన 'జెర్సీ' సినిమాలో ఆయన పోషించిన పాత్ర పేరు అది. 2019లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది.

అలాంటి ఈ కాంబినేషన్ మరోసారి సెట్ కానుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 'జెర్సీ' సినిమాను హిందీలో రీమేక్ చేసిన గౌతమ్ తిన్ననూరి, ఆ తరువాత తెలుగు సినిమానే చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. లాక్ డౌన్ సమయంలో తాను సిద్ధం చేసిన ఒక కథను రీసెంట్ గా నానీకి వినిపించాడట. దేశం కోసం చేసిన పోరాటంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న ఒక సిపాయి పరిస్థితి నేపథ్యంలో ఈ కథ రూపొందుతుందట. కథలో చాలాభాగం ఆ సిపాయి ఫ్లాష్ బ్యాక్ గా వస్తుందని అంటున్నారు. నాని ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెబుతున్నారు.
Nani
Gowtham Thinnanuri
Jersy movie

More Telugu News