Telangana: తెలంగాణలో 500కి దిగువన రోజువారీ కరోనా కేసులు

Telangana daily corona cases details

  • గత 24 గంటల్లో 65,607 కరోనా పరీక్షలు
  • 465 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 70 మందికి కరోనా
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 10,316 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 65,607 కరోనా పరీక్షలు నిర్వహించగా, 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 70 కేసులు, కరీంనగర్ జిల్లాలో 42, ఖమ్మం జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 869 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు.

తెలంగాణలో ఇప్పటివరకు 6,31,683 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,17,638 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,316 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,729కి పెరిగింది.

Telangana
Corona Virus
New Cases
Daily Cases
Deaths
Bulletin
Update
  • Loading...

More Telugu News