Madhya Pradesh: కరెంట్​ షాక్​ తో ఒకే ఇంట్లో ఆరుగురి దుర్మరణం

Electrocution Kills Six in a Family

  • ఇంటి నిర్మాణ పనుల్లో అపశ్రుతి
  • మధ్యప్రదేశ్ లో విషాదం
  • ట్యాంక్ కు లైటింగ్ పెట్టడంతో ప్రమాదం

విద్యుత్ షాక్ తో ఒకే ఇంట్లో ఆరుగురు చనిపోయిన విషాద ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని ఛత్తర్ పూర్ జిల్లా మహువా ఝాలా గ్రామంలో ఇంటి నిర్మాణ పనులు జరుగుతుండగా ఆ ఆరుగురు విద్యుత్ షాక్ కు గురయ్యారని పోలీసులు చెప్పారు. ఇంటి పైకప్పు వేసేందుకు వినియోగించే ప్లేట్లను తీసేందుకు ఓ వ్యక్తి ట్యాంకులోకి దిగాడని, అయితే, ట్యాంక్ లో లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన వైర్ల వల్ల ఆ ప్లేట్లలోకి కరెంట్ పాసయ్యి అతడు షాక్ కు గురయ్యాడని తెలిపారు.

అతడిని కాపాడేందుకు ట్యాంకులోకి దిగిన మిగతా ఐదుగురూ కరెంట్ షాక్ కు గురయ్యారన్నారు. విద్యుత్ సరఫరాను ఆపేసి వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయారని డాక్టర్లు చెప్పారన్నారు. మరణించిన వారు 20 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్నారన్నారు.

Madhya Pradesh
Electrocution
  • Loading...

More Telugu News