Ram: మాస్ మెచ్చేలా రామ్ న్యూ మూవీ టైటిల్!

- నిరాశపరిచిన 'రెడ్'
- లింగుసామితో కొత్త ప్రాజెక్ట్
- పరిశీలనలో 'ఉస్తాద్' టైటిల్
- త్వరలోనే రానున్న ప్రకటన
టాలీవుడ్ లో రామ్ కి కెరియర్ ఆరంభం నుంచి చాక్లెట్ బాయ్ అనే పేరు ఉంది. వరుసగా ఆయన ప్రేమకథలను చేసుకుంటూ వచ్చాడు. దాంతో యూత్ లో ... ముఖ్యంగా అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అలాంటి రామ్ ఆ తరువాత మాస్ ఇమేజ్ ను కోరుకున్నాడు. ఆ దిశగా అడుగులు వేస్తూ వెళ్లిన ఆయనకి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఆ ముచ్చట తీర్చింది. ఆ తరువాత రామ్ మళ్లీ కామెడీ టచ్ ఉన్న రొమాంటిక్ సినిమాలు చేసుకుంటూ వెళతాడని అనుకున్నారు.
