Kathi Mahesh: ఫిలిం క్రిటిక్ కత్తి మహేశ్ మృతి

Actor Kathi Mahesh dead

  • నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేశ్
  • చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • వైద్య ఖర్చుల కోసం రూ. 17 లక్షలు అందించిన ఏపీ ప్రభుత్వం

సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ మృతి చెందారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ముందు వెళ్తున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన మహేశ్ ను హుటాహుటిన నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. కత్తి మహేశ్ వైద్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ... ఫలితం దక్కలేదు. కత్తి మహేశ్ మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Kathi Mahesh
Tollywood
Dead
  • Loading...

More Telugu News