Madhu Yaskhi: కేటీఆర్.. నువ్వే కొత్త బిచ్చగాడివి: మధు యాష్కి ఫైర్

Madhu Yashki fires on KTR

  • తండ్రీకొడుకులు అక్రమంగా కోట్లాది రూపాయలను కూడబెట్టారు
  • కాంగ్రెస్ నేతలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు
  • టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన నేతలకు బుద్ధి చెపుతాం

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఇద్దరూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా కోట్లాది రూపాయలను కూడబెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ విమర్శించారు. కాంగ్రెస్ నేతలను తిట్టడమే వీరు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలను కొత్త బిచ్చగాళ్లుగా పేర్కొన్న కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త బిచ్చగాళ్లం తాము కాదని... నీవే కొత్త బిచ్చగాడివి కేటీఆర్ అని అన్నారు. రోజుకో వేషం వేసుకుంటూ, పూటకో అబద్ధం చెపుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నావని మండిపడ్డారు.

కాంగ్రెస్ లో గెలిచి, అధికార పార్టీకి అమ్ముడుపోయిన నేతలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెపుతామని అన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో పాటు నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయని... బీజేపీ, టీఆర్ఎస్ లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

Madhu Yaskhi
Congress
KCR
TRS
KTR
  • Loading...

More Telugu News