Varun Tej: క్లైమాక్స్ కు చేరుకున్న వరుణ్ తేజ్ 'గని'
![Ghani Climax Shoot](https://imgd.ap7am.com/thumbnail/cr-20210710tn60e9366eb51d8.jpg)
- బాక్సింగ్ నేపథ్యంలో సాగే 'గని'
- సయీ మంజ్రేకర్ పరిచయం
- కిరణ్ కొర్రపాటి తొలి ప్రయత్నం
- ఈ ఏడాదిలోనే విడుదల
వరుణ్ తేజ్ ఈ ఏడాది ఇప్పటికి రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలోని 'ఎఫ్ 3' అయితే, మరొకటి కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'గని'. కరోనా కారణంగా మధ్య మధ్యలో అవాంతరాలు ఎదురవుతున్నా, ఈ రెండు ప్రాజెక్టులలో ఆయన పాలుపంచుకుంటూనే వస్తున్నాడు. అయితే ముందుగా ఆయన 'గని' సినిమాను పూర్తిచేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ కి సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/20210710fr60e9366889381.jpg)