Kala Venkata Rao: కమీషన్లు దండుకున్న ఘనత జగన్‌ది: టీడీపీ నేత కళా వెంకట్రావు
![kala venkat rao slams jagan](https://imgd.ap7am.com/thumbnail/cr-20210710tn60e9299236d54.jpg)
- విద్యుత్ రంగంలో సంస్కరణలు చేసిన ఘనత చంద్రబాబుది
- ఇష్టం వచ్చినట్లు మోసాలకు పాల్పడడం జగన్‌కు అలవాటు
- అధికారంలోకి వచ్చాక విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదైతే, కమీషన్లు దండుకున్న ఘనత వైఎస్ జగన్‌ది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మోసాలకు పాల్పడడం జగన్‌కు అలవాటుగా మారిపోయిందని చెప్పారు.
తను అధికారంలోకి వచ్చాక విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని కళా వెంకట్రావు ఆరోపించారు. ఆయన పాలనలో రెండేళ్లలోనే మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజలపై భారం మోపారని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రాష్ట్రంలోని రైతులను అప్పుల పాలు చేయకూడదని ఆయన సూచించారు.