Alia Bhatt: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Alia Bhat eyes on Hollywood

  • అలియా హాలీవుడ్ ప్రయత్నాలు 
  • మహేశ్ కి విలన్ గా సముద్రఖని
  • 'సలార్'లో కీలక పాత్రలో వాణీకపూర్   

*  ప్రస్తుతం తెలుగులో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ త్వరలో హాలీవుడ్ ప్రవేశం చేయడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ హాలీవుడ్ కేస్టింగ్ ఏజన్సీ 'డి.ఎం.ఇ'తో అలియా ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా త్వరలోనే కొన్ని హాలీవుడ్ ప్రాజక్టులకు ఈ చిన్నది ఆడిషన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.  
*  మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందుతున్న 'సర్కారువారి పాట' చిత్రంలో విలన్ పాత్రకు ప్రముఖ తమిళ నటుడు సముద్రఖనిని ఖరారు చేసినట్టు సమాచారం. త్వరలో ప్రారంభమయ్యే చిత్రం తాజా షెడ్యూలులో ఆయన షూటింగులో జాయిన్ అవుతాడు. కాగా, ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే.
*  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' చిత్రంలో బాలీవుడ్ నటి వాణీకపూర్ కీలక పాత్ర పోషించనుంది. ఇందులో ఆమె విలన్ కు భార్యగా నటిస్తుందని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ నాయికగా నటిస్తోంది.

Alia Bhatt
Mahesh Babu
Samudrakhani
Prabhas
VaniKapoor
  • Loading...

More Telugu News