CM Jagan: క్రికెట్ బ్యాట్ పట్టిన సీఎం జగన్... వీడియో ఇదిగో!

CM Jagan plays cricket in YS Rajareddy stadium

  • కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్లకు శంకుస్థాపన
  • కాసేపు సరదాగా బ్యాటింగ్ చేసిన వైనం
  • పక్కా క్రికెటింగ్ షాట్లతో అలరించిన సీఎం

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే, ఆయన బయటి ప్రపంచంలో ఉల్లాసంగా గడిపే క్షణాలు చాలా తక్కువనే చెప్పాలి. ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ప్రజా సంబంధ విషయాలతో తలమునకలుగా ఉంటారు. అయితే, ఇవాళ కడప జిల్లా పర్యటనలో భాగంగా తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి పేరిట నిర్మితమైన వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో సరదాగా క్రికెట్ ఆడారు. ఈ నూతన స్టేడియంలో సీఎం జగన్ నేడు ఫ్లడ్ లైట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా బ్యాట్ పట్టిన సీఎం జగన్ క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం జగన్ కు క్రికెట్ లో నైపుణ్యం ఉన్నట్టు వీడియో క్లిప్పింగ్ చెబుతోంది. బ్యాటింగ్ స్టాన్స్ కానీ, గ్రిప్ కానీ, ఆయన బంతులను లెగ్ సైడ్ తరలించిన విధానం కానీ ఆకట్టుకునేలా వున్నాయి. సీఎం పక్కా క్రికెటింగ్ షాట్లు ప్రదర్శించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వన్ మోర్, వన్ మోర్ అంటూ మరికొన్ని బంతులు ఆడాలని ఆయనను ఉత్సాహపరిచారు.

CM Jagan
Cricket
Batting
YS Rajareddy Stadium
Kadapa District
YSRCP
Andhra Pradesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News