Sharwanand: షూటింగు పూర్తిచేసుకున్న 'మహాసముద్రం'

- భావోద్వేగాల 'మహాసముద్రం'
- ప్రధాన పాత్రల్లో శర్వా .. సిద్ధూ
- నాయికలుగా అదితి .. అనూ
- విలన్ పాత్రలో 'గరుడ' రామ్
- కీలకమైన పాత్రలో జగపతిబాబు
అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ - సిద్ధార్థ్ హీరోలుగా 'మహాసముద్రం' సెట్స్ పైకి వెళ్లింది. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసిన అజయ్ భూపతి, ఆ తరువాత ప్రాజెక్టుగా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి చాలా సమయమే పట్టింది. ఇక రెండు ప్రధానమైన పాత్రలకు హీరోలు సెట్ కావడానికి కూడా టైమ్ పట్టింది. అందువల్లనే ఆయన షూటింగు విషయంలో ఆలస్యం చేయలేదు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం చకచకా షూటింగు కానిచ్చేశాడు.
