Pavan kalyan: మరింత ముందుకు వెళుతున్న 'హరి హర వీరమల్లు'

Pavan latest movie update

  • కరోనా కారణంగా సినిమాల నిర్మాణంలో జాప్యం 
  • సంక్రాంతికి 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్
  • వేసవికి వెళుతున్న 'హరి హర వీరమల్లు'   

పవన్ కల్యాణ్ ప్రస్తుతం రెండు విభిన్నమైన సినిమాలను చేస్తున్నారు. ఒకటి క్రిష్ దర్శకత్వంలో .. మరొకటి సాగర్ చంద్ర దర్శకత్వంలో. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో చేస్తున్నారు. రానా మరో ప్రధానమైన పాత్రలో నటిస్తున్నారు. పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటిస్తున్న ఈ సినిమాను, ఆగస్టులో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రత వలన చాలా రోజుల పాటు షూటింగు ఆపుకోవలసి వచ్చింది. ఈ కారణంగా ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసే పరిస్థితి లేదు. అందువలన సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారట.

ముందుగా అనుకున్న ప్రకారం 'హరిహర వీరమల్లు' సంక్రాంతికి రావలసి ఉంది. కానీ కరోనా ఎఫక్ట్ కారణంగా ఈ సినిమా కూడా షూటింగ్ పరంగా ముందుకు వెళ్లలేకపోయింది. షూటింగ్ పరంగా జరిగిన జాప్యం వలన ఈ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు. అందువలన సంక్రాంతి బరిలోకి 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ ను దింపాలని చూస్తున్నారట.

చారిత్రక నేపథ్యంలో .. మొగల్ చక్రవర్తుల కాలంనాటి కథతో నడిచే 'హరి హర వీరమల్లు', ఎక్కువ భాగం షూట్ చేయవలసి ఉంది. ఈ కారణంగా ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ విషయంపై రెండు ప్రాజెక్టుల వారి మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు.

Pavan kalyan
Krish
Sagar Chandra
  • Loading...

More Telugu News