Narendra Singh Tomar: వ్యవసాయ చట్టాలను తొలగించే ప్రసక్తే లేదు: తోమర్
- మోదీ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
- అనంతరం మీడియాతో మాట్లాడిన వ్యవసాయ మంత్రి
- ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు సిద్ధమని వెల్లడి
- రైతులు నిరసనలు ఆపాలని పిలుపు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర నూతన క్యాబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడారు. 3 వ్యవసాయ చట్టాలను తొలగించే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. అయితే, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై రైతులతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రైతులు నిరసనలకు స్వస్తి పలికి, చర్చలకు ముందుకు రావాలని తోమర్ పిలుపునిచ్చారు. అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలపై ముఖ్యంగా రైతులు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. నెలల తరబడి ఢిల్లీ సరిహద్దుల్లో వారు తమ నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికి రైతులు, కేంద్రం మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.