Adi sai Kumar: 'కిరాతక' కథ నచ్చిందంటున్న పాయల్!

Kirathaka movie shooting will start in next month
  • వీరభద్రం నుంచి 'కిరాతక'
  • థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • నిర్మాతగా తిరుపతి రెడ్డి 
  • ఆగస్టు 13 నుంచి షూటింగ్       
టాలీవుడ్ లో పాయల్ కి మంచి క్రేజ్ ఉంది. పాయల్ కి ఆమె హైటు ప్రత్యేకమైన ఆకర్షణ. అందాలు ఆరబోయడానికి ఆమె ఎంతమాత్రం మొహమాటపడదనే విషయం, 'ఆర్ ఎక్స్ 100' సినిమాతోనే అందరికీ అర్థమైపోయింది. ఆ సినిమాతో యూత్ లో ఆమెకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోవడం వలన, అవి ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన ఆమె కాస్త వెనుకబడింది. అయినా సోషల్ మీడియా ద్వారా హాట్ ఫోటోలు వదులుతూ అభిమానులకు టచ్ లో ఉంటూ వచ్చింది.

ఆది సాయికుమార్ జోడీగా ఆమె 'కిరాతక' సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఆమె ఈ సినిమాను గురించి మాట్లాడుతూ .. " ఈ మధ్య కాలంలో నేను చాలా కథలు విన్నాను .. కానీ అవేవీ నాకు పెద్దగా నచ్చలేదు. దర్శకుడు వీరభద్రం గారు థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ కథను చెప్పారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అందుకే సింగిల్ సిట్టింగ్ లోనే నేను ఓకే చెప్పేశాను. ఈ సినిమా నా కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని అనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చింది. తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా, ఆగస్టు 13వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.  
Adi sai Kumar
payal Rajputh
Veerabhadram

More Telugu News