KTR: వైయస్, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలతో కేసీఆర్ కొట్లాడారు: కేటీఆర్

No one can face KCR says KTR

  • నిన్నకాక మొన్న పదవులు వచ్చిన వారు కేసీఆర్ పై ఎగిరెగిరి పడుతున్నారు
  • కేసీఆర్ తో తలపడటానికి డైలాగులు కొడితే సరిపోదు
  • కేసీఆర్ ను ఎదుర్కొనే శక్తి తెలంగాణలో ఎవరికీ లేదు

కేసీఆర్ ను విమర్శించడం ద్వారా గెలవాలనుకుంటే సాధ్యం కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమిస్తేనే అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. నిన్నకాక మొన్న పదవులు వచ్చిన వారు కేసీఆర్ పై ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తో తలపడటానికి డైలాగులు కొడితే సరిపోదని అన్నారు. కేసీఆర్ ను తిట్టడం ద్వారా శునకానందం పొందడం తప్ప, మరేమీ కాదని ఎద్దేవా చేశారు.

వైయస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలతో కొట్లాడిన చరిత్ర కేసీఆర్ దని కేటీఆర్ అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో నాలుగు సీట్లు గెలిచేసరికి బీజేపీ నేతలు రెచ్చిపోయారని... ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యే సరికి అసలు విషయం వారికి అర్థమయిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఎదుర్కోగల శక్తి తెలంగాణలో ఎవరికీ లేదని అన్నారు.

KTR
KCR
TRS
YSR
Chandrababu
Kiran Kumar Reddy
  • Loading...

More Telugu News