Balineni Srinivasa Reddy: తెలంగాణలోని చాలా ఇళ్లలో ఇప్పటికీ వైయస్ ఫొటోలు వున్నాయి: ఏపీ మంత్రి బాలినేని

AP minister Balineni fires on Telangana ministers

  • వైయస్ ను విమర్శిస్తున్నవారికి పుట్టగతులు ఉండవు
  • వారికి ప్రజలే బుద్ధి చెపుతారు   
  • హుజూరాబాద్ ఎన్నికల కోసమే వైయస్ పై విమర్శలు

దివంగత వైయస్ రాజశేఖరరెడ్డిని విమర్శించే అర్హత తెలంగాణ మంత్రులకు లేదని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైయస్ పై విమర్శలు గుప్పిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెపుతారని హెచ్చరించారు. వైయస్ ను విమర్శిస్తున్న తెలంగాణ మంత్రులకు పుట్టగతులు ఉండవని అన్నారు.

తెలంగాణలోని చాలా ఇళ్లలో ఇప్పటికీ వైయస్ ఫొటోలు ఉన్నాయని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, హుజూరాబాద్ ఎన్నికల కోసమే తెలంగాణ మంత్రులు వైయస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జయంతి సందర్భంగా ఒంగోలులో వైయస్ విగ్రహానికి బాలినేని పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

Balineni Srinivasa Reddy
YSRCP
Telangana
YSR
  • Loading...

More Telugu News