Revanth Reddy: కేంద్ర కేబినెట్​ విస్తరణ తీరుపై రేవంత్​ విమర్శలు

Revanth Criticizes Central Cabinet Re Shuffle
  • తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికే అవకాశం ఇచ్చారన్న రేవంత్ 
  • తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అవమానంగా భావించాలి 
  • 10 మందికి యూపీఏ అవకాశం ఇచ్చిందని వ్యాఖ్య 
టీపీసీసీ పగ్గాలు చేపట్టాక రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శల బాణాలకు పదును పెంచారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై ఆయన విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో తెలుగు వారికి దక్కిన ప్రాతినిధ్యాన్ని, ఇప్పుడు ఎన్డీయే ఇచ్చిన ప్రాధాన్యాన్ని పోల్చారు.

పదేళ్ల యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది తెలుగు వారికి కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో కేవలం ఒక్కరికే ఆ అవకాశం దక్కిందని విమర్శించారు. తమ సామర్థ్యాన్ని బీజేపీ అధినాయకత్వం విశ్వసించనందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు అవమానంగా భావించాలని అన్నారు.
Revanth Reddy
TPCC President
BJP

More Telugu News