YS Sharmila: ఇడుపులపాయలో షర్మిల ప్రార్థనలు.. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు!

YS Sharmila prayers at YSR Ghat in Idupulapaya

  • తండ్రి సమాధి వద్ద పార్టీ జెండా ఉంచి ప్రార్థనలు
  • పాల్గొన్న అనిల్ కుమార్, విజయమ్మ, సునీత  
  • సాయంత్రం పార్టీ ఆవిర్భావ ప్రకటన

తెలంగాణలో నేడు పార్టీని ప్రకటించనున్న వైఎస్ షర్మిల.. తండ్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని ఆయన ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ జెండాను సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో షర్మిల భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో షర్మిల బేగంపేట చేరుకుంటారు. అనంతరం పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సాయంత్రం రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు.

YS Sharmila
YSR Telangana Party
Idupulapaya
Kadapa District
  • Loading...

More Telugu News