Sri Vishnu: 'భళా తందనాన' నుంచి గరుడ రామ్ లుక్!
![Garuda Ram playing Villain role in Bhala Thandanana](https://imgd.ap7am.com/thumbnail/cr-20210707tn60e59d0bd737a.jpg)
- 'కేజీఎఫ్' నుంచి విపరీతమైన క్రేజ్
- వివిధ భాషల్లో విలన్ రోల్స్
- తెలుగులోను వరుస అవకాశాలు
- బర్త్ డే స్పెషల్ గా పోస్టర్ రిలీజ్
కేజీఎఫ్' సినిమా విడుదలైన తరువాత ఆ సినిమాలో 'గరుడ' రోల్ పోషించిన రామ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అప్పటి నుంచి వివిధ భాషల నుంచి ఆయనకి ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులోను ఆయన కెరియర్ పుంజుకుంటోంది. 'మహాసముద్రం' సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా .. పవర్ఫుల్ గా ఉండనుంది.
![](https://img.ap7am.com/froala-uploads/20210707fr60e59d074b52a.jpg)