Pasupati Paras: పశుపతి పరాస్‌కు కేంద్రమంత్రివర్గంలో చోటిస్తే కోర్టుకెళ్తా: చిరాగ్ పాశ్వాన్

Will move court if Pashupati Paras included in Union Cabinet

  • చీలిక వర్గంలోని నేతలను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవద్దు
  • పరాస్‌ను కేంద్రమంత్రిని చేయాలంటే స్వతంత్రంగా తీసుకోండి
  • ఎల్‌జేపీ కోటా కింద తీసుకుంటే తప్పకుండా వ్యతిరేకిస్తాం

లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)లో చీలికకు కారణమైన నేత పశుపతి పరాస్‌ను కేంద్రమంత్రిని చేస్తే కనుక తాము కోర్టుకు వెళ్తామని ఎల్‌జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ హెచ్చరించారు. పరాస్ ప్రస్తుతం ఎల్‌జేపీలో లేరని, కాబట్టి పార్టీ కోటా కింద ఆయన మంత్రి కాలేరని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయనకు కనుక కేంద్ర కేబినెట్‌లో చోటివ్వాలనుకుంటే తమ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా తీసుకోవచ్చని సూచించారు. ఎల్‌జేపీ కింద మంత్రిని చేస్తే మాత్రం తాము వ్యతిరేకిస్తామని, తప్పకుండా కోర్టుకు వెళ్తామని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు.

ఎల్‌జేపీని స్థాపించిన రాం విలాశ్ పాశ్వాన్ తమ్ముడే పశుపతి పరాస్. రాం విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను పశుపతి పరాస్ అన్ని పదవుల నుంచి తప్పించారు. పార్టీలోని రెబల్ గ్రూపునకు సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో ఆయనకు స్థానం దక్కే అవకాశం ఉందన్న వార్తలపై స్పందించిన చిరాగ్ పాశ్వాన్.. పార్టీ చీలిక వర్గంలోని ఏ ఒక్కరినీ కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవద్దని ప్రధానిని కోరారు. తీసుకుంటే కనుక కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News