Russia: 29 మందితో వెళుతోన్న రష్యా విమానం మిస్సింగ్​

A Russian Plane with 28 Onboard Missing

  • మారుమూల కాంచాక్తాలో ఘటన
  • ల్యాండ్ అవుతుండగా గల్లంతైందన్న అధికారులు
  • ఆకాశంలో దట్టమైన మేఘాలు
  • సహాయ చర్యల్లో అధికారులు

29 మందితో వెళుతోన్న విమానం ఆచూకీ గల్లంతైంది. రష్యాలోని మారుమూల దీవి అయిన కాంచాక్తాలో ఈ ఘటన జరిగింది. పెట్రోపావ్లోస్క్ నుంచి పాలానాకు వెళ్లిన ఏఎన్ 26 విమానం ల్యాండ్ అవుతుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో అనుసంధానం కోల్పోయిందని ఆ దేశ ఎమర్జెన్సీ శాఖ ప్రకటించింది.

విమానంలో ప్రయాణిస్తున్న 28 మందిలో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒకరిద్దరు చిన్నారులూ ఉన్నారని అంటున్నారు. విమానం అనుసంధానం కోల్పోయిన ప్రాంతానికి సహాయ బృందాలు హుటాహుటిన వెళ్లాయి. అప్పటికే కాంటాక్ట్ కోల్పోయిన విమానం కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఘటన సమయంలో ఆకాశంలో దట్టమైన మేఘాలు అలముకున్నాయని, వాతావరణం బాగాలేదని అధికారులు చెబుతున్నారు.

కాగా, ఒకప్పుడు విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగే రష్యాలో గత కొన్నేళ్లుగా ఆ పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఎయిర్ ట్రాఫిక్ సేఫ్టీని ఆ దేశ ప్రభుత్వం పటిష్ఠపరిచింది. అయితే, విమానాల నిర్వహణలో లోపాలు, అత్యంత హీన స్థితిలో భద్రతా ప్రమాణాలున్నాయన్న విమర్శలున్నాయి.

Russia
Flight
Missing
  • Loading...

More Telugu News