Vijay Sai Reddy: అధికారం పోయాక అశోక్ గజపతి అసలు గుట్టు బయట పడుతోంది: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai reddy slams tdp

  • 2004 నుంచి మాన్సాస్ లో అసలు ఆడిటింగే జరగలేదు
  •  అధికారులు వివరాలివ్వాలని లేఖలు రాస్తే  ఏం లాభం?
  •  రాజ్యం చంద్రబాబు భోజ్యంలా చేశావు  

మాన్సాస్‌ ట్రస్టు కార్యకలాపాలపై జమాబందీ లెక్కల తనిఖీలు నిన్న‌ ప్రారంభమయ్యాయి. ఆ ట్రస్టు కార్యాలయంలో రికార్డులను విజయనగరం జిల్లా ఆడిట్‌ అధికారులు పరిశీలించారు. దీనిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు.

'అధికారం పోయాక అశోక్ గజపతి అసలు గుట్టు బయట పడుతోంది. 2004 నుంచి మాన్సాస్ లో అసలు ఆడిటింగే జరగలేదు. ఆడిటింగ్ కి డబ్బులిచ్చేశాం - అధికారులు వివరాలివ్వాలని లేఖలు రాస్తే ఏం లాభం. ఇంతకాలం గుడ్డి గుర్రం పళ్లుతోమావా - గాడిదలు కాస్తున్నావా రాజా? రాజ్యం చంద్రబాబు భోజ్యంలా చేశావు' అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై కూడా విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 'తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్లు పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. చిత్తూరు జిల్లాలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించాడు. నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోంది బాబూ!' అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Vijay Sai Reddy
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News