Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్ నేత‌ భ‌ట్టి విక్ర‌మార్క‌తో మ‌ల్లు ర‌వి భేటీ

mallu ravi meets bhatti

  • రేవంత్ రెడ్డిని క‌లిసేందుకు విముఖంగా ఉన్న భ‌ట్టి
  • భ‌ట్టిని ఢిల్లీకి పిలిపించి చ‌ర్చించిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • ఢిల్లీ నుంచి వ‌చ్చిన భ‌ట్టి విక్ర‌మార్క‌తో మ‌ల్లు ర‌వి భేటీ 

టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేపు రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు కీల‌క నేత‌లు రానున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న వేళ కాంగ్రెస్ నేత‌ భ‌ట్టి విక్ర‌మార్క‌తో పీసీసీ సీనియ‌ర్ ఉపాధ్య‌క్షుడు మ‌ల్లు ర‌వి ఈ రోజు స‌మావేశం అయ్యారు.

రేవంత్ రెడ్డిని క‌లిసేందుకు భ‌ట్టి విక్ర‌మార్క విముఖ‌త చూపుతున్నారు. దీంతో భ‌ట్టిని ఢిల్లీకి పిలిపించి అధిష్ఠానం చ‌ర్చ‌లు జ‌రిపింది. ఢిల్లీ నుంచి వ‌చ్చిన భ‌ట్టి విక్ర‌మార్క‌తో మ‌ల్లు ర‌వి భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇప్ప‌టికే ప‌లువురు రాష్ట్ర‌ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల‌ను రేవంత్ రెడ్డి క‌లిసి వారి మ‌ద్ద‌తును కూడ‌గట్ట‌గ‌లిగారు. రేవంత్‌కి మొద‌టి నుంచి మ‌ల్లు ర‌వి సంపూర్ణ మ‌ద్ద‌తును తెలుపుతున్నారు.

Mallu Bhatti Vikramarka
Mallu ravi
Congress
Telangana
TPCC President
  • Loading...

More Telugu News