Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Kajal Agarwal in Kolkata for her latest film Uma
  • కోల్ కతాలో కాజల్ షూటింగ్  
  • వచ్చే నెలలో 'ఆరడుగుల బుల్లెట్'
  • 'మీట్ క్యూట్'లో ఆకాంక్ష సింగ్    
*  కథానాయిక కాజల్ అగర్వాల్ నటిస్తున్న హిందీ చిత్రం 'ఉమ' షూటింగ్ కోల్ కతాలో మొదలైంది. తథాగత సింఘ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కథానాయిక ప్రధాన చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగును సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేసేలా ప్లాన్ చేశారు.
*  గోపీచంద్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో కొన్నాళ్ల క్రితం రూపొందిన 'ఆరడుగుల బుల్లెట్' చిత్రం అన్ని అవాంతరాలను అధిగమించి వచ్చే నెలలో రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత తాండ్ర రమేశ్ వెల్లడించారు. ఇందులో నయనతార కథానాయికగా నటించింది.
*  నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో రూపొందే 'మీట్ క్యూట్' చిత్రంలో ఒక హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్ నటించనుంది. ఇందులో మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లు నటిస్తారు.
Kajal Agarwal
Gopichand
Nayanatara
Nani

More Telugu News