Varun Sandesh: 'ఇందువదన' నుంచి 'వడివడిగా ..' లిరికల్ వీడియో!

- వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ
- కొత్త హీరోయిన్ పరిచయం
- సంగీత దర్శకుడిగా శివ కాకాని
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
వరుణ్ సందేశ్ కెరియర్ ఆరంభంలోనే హిట్స్ కొట్టాడు .. యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తరువాత కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వలన పరాజయాలు పలకరించాయి. దాంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కొంత గ్యాప్ తరువాత మళ్లీ ఇప్పుడు ఆయన ఒక ప్రేమకథా చిత్రంలో నటించాడు. ఆ సినిమా పేరే 'ఇందువదన'. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ సినిమాకి ఎమ్మెస్సార్ దర్శకుడిగా వ్యవరించాడు. ఈ సినిమాతో కథానాయికగా ఫర్నాజ్ శెట్టి పరిచయమవుతోంది.
