Vijay Serhupathi: 'ఆహా'లో విజయ్ సేతుపతి 'విక్రమార్కుడు'
![Vijay Sethupathi Vikramarkudu movie in Aha](https://imgd.ap7am.com/thumbnail/cr-20210705tn60e2ffbb4d9f1.jpg)
- తమిళంలో హిట్ కొట్టిన 'జుంగా'
- తెలుగు అనువాదంగా 'విక్రమార్కుడు'
- మాఫియా డాన్ గా విజయ్ సేతుపతి
- ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్
విజయ్ సేతుపతి విలక్షణమైన పాత్రలను పోషించిన సినిమాలలో 'జుంగా' ఒకటిగా కనిపిస్తుంది. 2018లో తమిళంలో విడుదలైన ఈ సినిమా, అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమాను 'ఆహా' వారు 'విక్రమార్కుడు' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి 'ఆహా' ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విజయాలను సాధించిన ఇతర భాషా చిత్రాలను కూడా అనువాదాలుగా అందిస్తోంది.
![](https://img.ap7am.com/froala-uploads/20210705fr60e2ffb735608.jpg)