Sonu Sood: ఆక్సిజన్ ప్లాంటు నెల్లూరుకు చేరుకుంది: సోనూసూద్‌

Oxygen plant reached to Nellore says Sonu Sood

  • విదేశాల నుంచి ఆక్సిజన్ ప్లాంటును తెప్పించిన సోనూసూద్‌ 
  • నెల్లూరులో త్వరలోనే ఆక్సిజన్ తయారు కాబోతోందన్న సోను
  • తెలుగు రాష్ట్రాలతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో ప్లాంట్ల ఏర్పాటు

కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్ అందక ఎంతో మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ కోసం రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కరోనా ప్రారంభమయినప్పటి నుంచి సినీ నటుడు సోనూసూద్‌ ఎందరో అభాగ్యులకు అండగా నిలిచారు. సాయం కోరిన ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబానికి తన వంతు సాయం చేస్తూ నిస్వార్థంగా సేవలు అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆయన ఆక్సిజన్ ప్లాంటును నెలకొల్పారు.

నెల్లూరులో నెలకొల్పేందుకు విదేశాల నుంచి సోనూసూద్‌ ప్లాంటును తెప్పించారు. ప్లాంటు నెల్లూరుకు చేరుకుందని సోను ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరుకు చేరుకుందని చెప్పడానికి సంతోష పడుతున్నానని చెప్పారు. ప్రాణ వాయువు త్వరలోనే తయారు కాబోతోందని తెలిపారు. తాను ఎంతో అభిమానించే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరిన్ని ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.

Sonu Sood
Tollywood
Nellore
Oxygen Plant
  • Error fetching data: Network response was not ok

More Telugu News