Revanth Reddy: క‌ర్ణాట‌క‌లో రేవంత్ రెడ్డికి ఘ‌న‌స్వాగ‌తం.. కీల‌క నేత‌ల‌ను క‌లిసిన టీపీసీసీ అధ్య‌క్షుడు

revant meets dks

  • టీపీసీసీ కొత్త‌ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్‌రెడ్డి
  • ఎల్లుండి గాంధీ భ‌వ‌న్‌లో ప్ర‌మాణ స్వీకారం
  • రావాల్సిందిగా ఖ‌ర్గే, డీకే శివ‌కుమార్ ను కోరిన రేవంత్

టీపీసీసీ కొత్త‌ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్‌రెడ్డి ఇప్ప‌టికే పార్టీలోని సీనియర్లతో పాటు తన నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలనూ కలిసిన విష‌యం తెలిసిందే. వారిని బుజ్జ‌గించ‌డంతో పాటు త‌న ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి రావాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆయ‌న క‌ర్ణాట‌క‌కు వెళ్లారు. బెంగ‌ళూరు విమానాశ్ర‌యంలో ఆయ‌న‌కు అక్క‌డి కాంగ్రెస్ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

అనంత‌రం ఆయ‌న క‌ర్ణాట‌క కాంగ్రెస్ కీల‌క నేత‌ డీకే శివ‌కుమార్ వ‌ద్ద‌కు వెళ్లి త‌న ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి రావాల‌ని కోరారు. అక్క‌డి నుంచి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఇంటికి వెళ్లి ఆయ‌న‌తో చ‌ర్చించి ఆయ‌న‌ను కూడా త‌న ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఆహ్వానించారు. కాగా, ఎల్లుండి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

అదే రోజు ఉదయం 10 గంటలకు పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారికి పూజ‌లు చేస్తారు. అనంత‌రం నాంపల్లిలోని దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ లో ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం గాంధీ భ‌వ‌న్‌లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు కీల‌క నేత‌లు రానున్నారు.

Revanth Reddy
TPCC President
Congress
DK Shivakumar
kharge
  • Error fetching data: Network response was not ok

More Telugu News