Puvvada Ajay Kumar: తనయుడితో కలిసి జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను క‌లిసిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్!

puvvada meets ntr

  • పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్భంగా భేటీ
  • మర్యాదపూర్వకంగా కలిశాన‌న్న పువ్వాడ‌
  • అనంత‌రం కేటీఆర్ వ‌ద్ద‌కు పువ్వాడ‌

'నా తనయుడు డాక్ట‌ర్ పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడమైంది' అంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా తార‌క్ తో తీసుకున్న ఫొటోల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు.
            
ఆ స‌మ‌యంలో అక్క‌డ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా ఉన్నారు. అయితే, ఉన్న‌ట్టుండి పువ్వాడ జూనియ‌ర్ ఎన్టీఆర్ ను క‌ల‌వ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. పువ్వాడ నయన్ ను సినిమాల్లోకి తీసుకొస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కి న‌య‌న్ అభిమాని అయి ఉండొచ్చ‌ని మరి కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.
      
మ‌రోవైపు, కేటీఆర్‌ను కూడా పువ్వాడ అజ‌య్ కుమార్, నయ‌న్ కలిశారు. 'నేడు నా తనయుడు డాక్ట‌ర్ పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడమైంది' అని పువ్వాడ అజ‌య్ కుమార్ ట్వీట్ చేశారు.

Puvvada Ajay Kumar
Junior NTR
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News