Twitter: పోస్టుపై అభ్యంత‌రాలు తెలుపుతూ ట్విట్ట‌ర్ పై న్యాయ‌వాది కేసు!

case files against twitter

  • ట్విట్ట‌ర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరిపై ఫిర్యాదు
  • ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన సైబర్ సెల్‌లో కేసు
  • మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న‌ న్యాయవాది
  • ఎథిస్ట్ రిపబ్లిక్ పేరుతో ఓ అభ్యంత‌ర‌క‌ర‌ పోస్టు ఉందని వ్యాఖ్య

భార‌త ప్ర‌భుత్వానికి, ట్విట్ట‌ర్ సంస్థ‌కు మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో మ‌రోవైపు ఆ మైక్రోబ్లాగింగ్ సైట్ పై ఫిర్యాదులూ పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరిపై దేశంలోని ప‌లు ప్రాంతాల్లో కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే.

తాజాగా ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన సైబర్ సెల్‌లో మ‌రో కేసు న‌మోదైంది. మనీశ్ మహేశ్వరి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని న్యాయవాది ఆదిత్యా సింగ్  ఫిర్యాదు చేశారు. ట్విట్ట‌ర్‌లో ఎథిస్ట్ రిపబ్లిక్ పేరుతో ఓ అభ్యంత‌ర‌క‌ర‌ పోస్టు ఉందని ఆయ‌న చెప్పారు. ఈ పోస్టు సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ పోస్టు పెట్టారని అన్నారు.  

ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ తో పాటు పబ్లిక్ పాలసీ మేనేజర్ షగుఫ్తా కమ్రాన్‌, రిపబ్లిక్ ఎథిస్ట్ వ్యవస్థాపకులు ఆర్మిన్ నవాబీ, సీఈవో సుసైన్, తదితరులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. ఇటువంటి వివాదాస్పద పోస్టులను ఆ సంస్థ తొల‌గించ‌డం లేద‌ని అన్నారు. ఇది భార‌త‌ చట్టాల‌ ఉల్లంఘన కింద‌కు వ‌స్తుంద‌ని చెప్పారు.  

  • Loading...

More Telugu News