atm: ఎస్‌బీఐ ఎటీఎంలో డబ్బు డ్రా చేస్తే బ్యాంకు మూలధనం నుంచి డెబిట్ అయిన వైనం!
- హైదరాబాద్‌లోని రాంనగర్‌లో ఘటన
- దాదాపు రూ.3.40 లక్షలు విత్‌డ్రా
- సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్‌లోని రాంనగర్‌లోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) ఎటీఎంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఎటీఎంలో కస్టమర్లు నగదు విత్‌డ్రా చేసుకోగా వారి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు రాకుండా వారికి బ్యాంకు మూలధనం నుంచి డబ్బులు వచ్చాయి. డబ్బు విత్ డ్రా చేసుకున్నప్పటికీ కస్టమర్ల ఖాతా నుంచి నగదు డెబిట్ కాకపోవడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆ ఏటీఎం నుంచి దాదాపు రూ.3.40 లక్షలు విత్‌డ్రా జరిగింది. అంతేకాదు, ఏటీఎం సాఫ్ట్‌వేర్ లోపంతో సాంకేతిక ఆధారాలు సైతం బ్యాంకు అధికారులకు లభించలేదు. రామ్‌నగర్‌లోని ఒకే ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ పని సైబర్ కేటుగాళ్లే చేసి ఉంటారని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కొనసాగుతోంది.