Singer Chinmahi: నేను ప్రెగ్నెంట్ కాదు: సింగర్ చిన్నయి

I am not pregnant says singer Chinmayi
  • ఇటీవల ఒక వివాహానికి హాజరైన చిన్మయి
  • ఫొటోల్లో బేబీ బంప్ తో ఉన్నట్టు కనిపిస్తున్న గాయని
  • చిన్మయి ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
సినీ గాయని చిన్మయి పేరు తెలియని వారు ఉండరు. ప్లేబ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న చిన్మయి... సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై గళమెత్తి పలువురు సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. మీటూ ఉద్యమంలో దక్షిణాదిన ఎక్కువగా పోరాడింది చిన్మయి మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ రైటర్ గా ఉన్న వైరముత్తుకు చిన్నయి చుక్కలు చూపించారు. మరోవైపు తాజాగా చిన్నయిపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
 
వివరాల్లోకి వెళ్తే ఇటీవల చిన్మయి తన భర్త రాహుల్ రవిచంద్రన్ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో చిన్మయి చీరకట్టులో ఉంది. అయితే ఆమె చీర కట్టిన విధానం వల్ల ఆమె బేబీ బంప్ తో ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆమె గర్భవతి అనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై చిన్మయి స్పందించారు. తాను గర్భవతి అనే వార్తలను ఆమె ఖండించారు. తాను గర్భవతిని కాదని చెప్పారు. తాను మడిసార్ ధరించానని... ఎక్కువగా నడవడంతో చీర వదులుగా అయిందని అన్నారు. అయినా తన పర్సనల్ విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు.

ఒకవేళ నేను గర్భవతిని అయినా ఆ విషయాన్ని మీతో పంచుకోవచ్చు లేదా పంచుకోకపోవచ్చు అని చిన్మయి అన్నారు. తమ పిల్లల ఫొటోలను వంద శాతం తాము సోషల్ మీడియాలో పంచుకోబోమని తెలిపింది. తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లను ఇప్పటికైనా ఆపాలని కోరారు.
Singer Chinmahi
Pregnant
Tollywood
Kollywood

More Telugu News