Srisailam: శ్రీశైలం జలాశయానికి ఆగిపోయిన వరద

Flood water stopped to Srisailam dam

  • రెండు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన వర్షాలు
  • ఔట్ ఫ్లో 21,189 క్యూసెక్కులు
  • ఎడమగట్టులో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో శ్రీశైలం జలాశయంలోకి వరద నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఔట్ ఫ్లో మాత్రం 21,189గా ఉంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 820 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిలువ కెపాసిటీ 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 40.8748 టీఎంసీల నీరు ఉంది.

తెలంగాణ పరిధిలో ఉన్న ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా... ఏపీ పరిధిలోని కుడిగట్టులో మాత్రం విద్యుదుత్పత్తి ప్రారంభంకాలేదు. మరోవైపు నేటి నుంచి జలాశయం పైకి సందర్శకులను అనుమతించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జలాశయం వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించారు.

Srisailam
Flood
  • Loading...

More Telugu News